గుంటూరు: వాగులో కొట్టుకుపోయిన కారు.. ముగ్గురు మృతి | Car Washed Away In A Stream In Uppalapadu Guntur | Sakshi
Sakshi News home page

గుంటూరు: వాగులో కొట్టుకుపోయిన కారు.. ముగ్గురు మృతి

Aug 31 2024 4:26 PM | Updated on Aug 31 2024 4:57 PM

Car Washed Away In A Stream In Uppalapadu Guntur

ఉప్పలపాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరద ఉధృతికి కారు మురుగు వాగులో కొట్టుకుపోయింది.

సాక్షి, గుంటూరు: ఉప్పలపాడులో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. వరద ఉధృతికి కారు మురుగు వాగులో కొట్టుకుపోయింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతిచెందారు. టీచర్‌ సహా ఇద్దరు విద్యార్థులు మృతిచెందారు. మృతులను రాఘవేంద్ర, సాత్విక్‌, మాన్విక్‌గా గుర్తించారు.

విజయవాడలో నిన్నటి నుండి ఎడతెరిపిలేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి నలుగురు మృతి చెందారు. మేఘన, బోలెం లక్ష్మీ, లాలూ, అన్నపూర్ణ చెందారు, నగరంలో రహదారులన్నీ జలమయంగా మారాయి.

ఎన్టీఆర్ సర్కిల్ నుండి కానూరువరకు రహదారి నీటమునిగింది.  ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతం జలదిగ్భంధంలో చిక్కుకుంది. దుర్గగుడిపైనా భారీ వర్షాల ప్రభావం పడింది. దుర్గగుడి ఘాట్ రోడ్ మూసివేశారు. దుర్గగుడి కొండపై ఘాట్ రోడ్‌లో కొండ చరియలు విరిగిపడుతున్నారు. విజయవాడ వన్ టౌన్ ప్రాంతంలో కాలనీలు నీటమునిగాయి. నిన్న రాత్రి నుంచి కుండపోత వర్షం కురుస్తోంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement