మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ వాహనంపై టీడీపీ గూండాల దాడి | Attack on Former MLA Uma Shankar Ganeshs Vehicle | Sakshi
Sakshi News home page

మాజీ ఎమ్మెల్యే ఉమా శంకర్ వాహనంపై టీడీపీ గూండాల దాడి

Apr 27 2026 10:24 PM | Updated on Apr 28 2026 4:38 AM

Attack on Former MLA Uma Shankar Ganeshs Vehicle

నర్సీపట్నం: మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేశ్‌ వాహనంపై టీడీపీ గుండాలు దాడి చేశారు. ఉమా శంకర్ వాహనాన్ని ధ్వంసం చేశారు. హైకోర్టులో స్టే ఉండగా.. రాత్రిపూట నర్సీపట్నంలోని సృష్టి క్షేత్రంలో అక్రమంగా మట్టి తవ్వకం, ఇతర పనులు జరుగుతున్నాయి. వాటిని ఉమా శంకర్ పరిశీలించారు. హైకోర్టులో స్టే ఉండగా పనులు ఎలా జరుపుతున్నారని ప్రశ్నించారు.

ఆయనను అడ్డుకున్న టీడీపీ గూండాలు వాగ్వివాదానికి దిగారు. హైకోర్టులో కేసు ఉండగా మట్టిని ఎలా తరలిస్తున్నారని ఉమాశంకర్ ప్రశ్నించారు. టీడీపీ గూండాల బరితెగింపును నిలదీశారు. కాగా, నర్సీపట్నంలో టీడీపీ గూండాలూ యథేచ్ఛగా మట్టిని తరలిస్తున్న తీరు విస్మయం కలిగిస్తోంది. మట్టి తవ్వకం,  పనుల నిర్మాణంపై ఇప్పటికే ఉమా శంకర్‌ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. సృష్టి క్షేత్రంపై ఫిర్యాదు చేసినప్పటికీ కలెక‍్టర్‌ పట్టించుకోలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement