
సాక్షి, అమరావతి: ఢిల్లీలోని పార్లమెంట్ భవన్‌లో సోమవారం అరకు కాఫీ స్టాల్స్ ప్రారంభం కానున్నాయి. అరకు కాఫీకి మరింత ప్రచారం కల్పించేందుకు లోక్‌సభ స్పీకర్ అవకాశం కల్పించారు.
సంగం 1, 2 కోర్ట్ యార్డ్ వద్ద సోమవారం నుంచి ఈ నెల 28 వరకు స్టాల్స్ ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చారు. దీంతో అరకు కాఫీ స్టాల్స్ ఏర్పాటు కోసం గిరిజన సంక్షేమ శాఖ మంత్రి జి.సంధ్యారాణి, గిరిజన కో–ఆపరేటివ్ సొసైటీ(జీసీసీ) అధికారులు ఆదివారం ఢిల్లీ వెళ్లారు.