AP: వారం రోజులపాటు వర్ష సూచన..పలు జిల్లాల్లో భారీ వర్షాలు | AP Weather: Week long rain alert issued for state | Sakshi
Sakshi News home page

AP: వారం రోజులపాటు వర్ష సూచన..పలు జిల్లాల్లో భారీ వర్షాలు

Jul 3 2026 3:49 PM | Updated on Jul 3 2026 4:02 PM

AP Weather: Week long rain alert issued for state

విశాఖ : వాయువ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో వారం రోజులపాటు వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ అల్ప పీడనం రానున్న 48 గంటల్లో మరింత బలపడి పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందచని హెచ్చరించింది. 

రాగల 24 గంటల్లో అల్లూరి, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. దీనిలో భాగంగా కళింగపట్నం నుంచి మచిలీపట్నం వరకు ఉన్న అన్ని పోర్టులకు 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కోస్తా తీరం వెంబడి మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని హెచ్చరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement