ట్రిపుల్‌ ఐటీ పిలుస్తోంది.. దరఖాస్తు చేసుకోండి ఇలా 

AP Rgukt IIIT Notification 2022 2023: Last Date For Applications September 19th - Sakshi

ఈనెల 19 వరకు గడువు 

29న ఎంపిక జాబితా విడుదల

సత్తెనపల్లి (పల్నాడు జిల్లా): రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ (ఆర్టీయూకేటీ) పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, శ్రీకాకుళం, ఒంగోలు ట్రిపుల్‌ ఐటీల్లో ఆరేళ్ల బీటెక్‌ సమీకృత ఇంజినీరింగ్‌ కోర్సులో ప్రవేశానికి ఇటీవలే నోటిఫికేషన్‌ విడుదలైంది. ఒక్కో సెంటర్‌లో 1100 సీట్లు (ఈడబ్ల్యూఎస్‌ కింద వంద సీట్లు అదనం) అందుబాటులో ఉన్నాయి. గతనెల 30 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది.
చదవండి: అది ‘ఐ–టీడీపీ’ పనే

పదో తరగతిలో మెరిట్, రిజర్వేషన్ల ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. నూజివీడు,  ఇడుపులపాయలోని సీట్లలో 85 శాతం సీట్లు స్థానికంగా, మిగిలిన 15 శాతం సీట్లను మెరిట్‌ కోటాలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల విద్యార్థులకు కేటాయిస్తారు. ఎంపికైన విద్యార్థులకు ఈ–మెయిల్, మొబైల్‌కు సమాచారం ఇస్తారు. కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సినవి కౌన్సెలింగ్‌ సమయంలో విద్యార్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు సమర్పించినప్పుడు ఇచ్చిన రశీదు, పదో తరగతి హాల్‌ టికెట్, మార్కులలిస్టు, రెసిడెన్స్‌ సర్టిఫికెట్, సంబంధిత రిజర్వేషన్ల ధ్రువీకరణపత్రాలు సమర్పించాలి.

అర్హతలు 
అభ్యర్థులు ప్రథమ ప్రయత్నం లోనే 2022లో ఎస్‌ఎస్‌సీ, తత్సమాన పరీక్షలో రెగ్యులర్‌ విద్యార్థిగా ఉత్తీర్ణులై ఉండాలి. 
ఈ ఏడాది సప్లిమెంటరీలో ఉత్తీర్ణులైన వారూ రెగ్యులర్‌గానే ప్రభుత్వం ప్రకటించినందున వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. 

దరఖాస్తు ఇలా.. 
♦ ఏపీ ఆన్‌లైన్‌ సెంటర్‌ ద్వారా ఆర్జీయూకేటీ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 
♦ ఓసీ, బీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము రూ. 250, ఎస్సీ, ఎస్టీలు రూ. 150 చెల్లించాలి. 
♦ రశీదును జాగ్రత్తగా పెట్టుకోవాలి, సర్వీసు చార్జి కింద ఆన్‌లైన్‌ సెంటర్‌కు అదనంగా రూ.25లు చెల్లించాలి. 

ఫీజుల వివరాలు
♦ రాష్ట్రంలోని పాఠశాలల్లో చదివిన విద్యార్థులు 
♦ ట్యూషన్‌ ఫీజు కింద పీయూసీ–1, పీయూసీ–2లకు ఏడాదికి రూ.45వేలు, ఇంజినీరింగ్‌ నాలుగు సంవత్సరాలకు ఏడాదికి రూ.50వేలు చొప్పున చెల్లించాలి. ఫీజు 
రీయింబర్స్‌మెంట్‌కు అర్హులైన విద్యార్థులు చెల్లించాల్సిన అవసరం లేదు. 
♦ ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ట్యూషన్‌ ఫీజు ఏడాదికి రూ.1.50 లక్షలు చెల్లించాలి 
♦ ఎన్నారై, అంతర్జాతీయ విద్యార్థులు అయితే ఏడాదికి రూ.3 లక్షలు ట్యూషన్‌  ఫీజు చెల్లించాలి

కోర్సులు
పీయూసీ : గణితం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, ఇంగ్లిషు, తెలుగు, ఐటీ, బయాలజీ సబ్జెక్టులు ఉంటాయి. 
ఇంజినీరింగ్‌ : కెమికల్, మెటలర్జికల్‌ అండ్‌ మెటీరియల్‌ ఇంజినీరింగ్‌ (ఈ రెండు నూజివీడు, ఇడుపులపాయలో మాత్రమే ఉన్నాయి). సివిల్, సీఎస్‌ఈ, ఈఈఈ, ఈసీఈ,  మెకానికల్‌ బ్రాంచ్‌లు.

గుర్తుంచుకోవాల్సిన తేదీలు 
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు గడువు : సెప్టెంబర్‌ 19 
అర్హుల జాబితా విడుదల : సెప్టెంబర్‌ 29 
కౌన్సెలింగ్‌ తేదీలు : అక్టోబరు 12 నుంచి 15 వరకు 
తరగతులు ప్రారంభం : అక్టోబరు 1

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top