AP EAPCET: ఏపీ ఈఏపీ సెట్‌ ఫలితాలు విడుదల | AP EAP Cet Results Released | Sakshi
Sakshi News home page

AP EAPCET: ఏపీ ఈఏపీ సెట్‌ ఫలితాలు విడుదల

Jun 8 2025 6:59 PM | Updated on Jun 8 2025 6:59 PM

AP EAP Cet Results Released

విజయవాడ: ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాల్లో ప్రవేశాలకు గాను గత నెలలో జరిగిన ఏపీ-ఈఏపీ సెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి.  ఇంజనీరింగ్‌ విభాగంలో 1.89 లక్షల మంది ఉత్తీర్ణత సాధించారు. హైదరాబాద్‌ విద్యార్థి అనిరుద్‌రెడ్డికి తొలి ర్యాంక్‌ రాగా, శ్రీకాళహస్తి విద్యార్థి భాను చరణ్‌రెడ్డి రెండో ర్యాంక్‌ వచ్చిఇంది. ఇక పాలకొల్లు విద్యార్థి యశ్వంత్‌ మూడో ర్యాంకు కైవసం చేసుకున్నాడు. 

ఇక అగ్రికల్చర్‌, ఫార్మా విభాగంలో 89.9 శాతం ఉత్తీర్ణత సాధించారు విద్యార్థులు. అగ్రి, ఫార్మాసీలో సాయి హర్షవర్థన్‌కు తొలి ర్యాంకు రాగా, రంగారెడ్డి జిల్లాకు చెందిన నిశాంత్‌కు రెండో ర్యాంక్‌, కోనసీమ జిల్లా విద్యార్థి వినయ్‌ మల్లేశ్‌కు మూడో ర్యాంకు వచ్చింది. 

కాగా, గత నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకూ ఏపీ  ఈఏపీ సెట్‌ నిర్వహించారు. ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ విభాగాలకు మొత్తం 3,62, 392 మంది  దరఖాస్తు చేసుకున్నారు.  రాష్ట్ర వ్యాప్తంగా 145 పరీక్షా కేంద్రాలతో పాటు హైదరాబాద్‌ లో రెండు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 

 

 

 


 

Advertisement
 
Advertisement
Advertisement