గుర్రం జాషువాకు సీఎం వైఎస్ జగన్ నివాళి

సాక్షి, అమరావతి: నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఘన నివాళులర్పించారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. ‘‘కవిత్వమే ఆయుధంగా మూఢాచారాలపై తిరగబడ్డ ఆధునిక తెలుగు కవి శ్రీ గుర్రం జాషువా. వడగాల్పు నా జీవితం.. వెన్నెల నా సాహిత్యం అంటూ పేదరికం, వర్గ సంఘర్షణ, ఆర్థిక అసమానతలపై పోరాడిన అభ్యుదయ వాది జాషువా. మహాకవి జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను’’ అంటూ సీఎం ట్వీట్ చేశారు.
కవిత్వమే ఆయుధంగా మూఢాచారాలపై తిరగబడ్డ ఆధునిక తెలుగు కవి శ్రీ గుర్రం జాషువా. వడగాల్పు నా జీవితం.. వెన్నెల నా సాహిత్యం అంటూ పేదరికం, వర్గ సంఘర్షణ, ఆర్థిక అసమానతలపై పోరాడిన అభ్యుదయ వాది జాషువా. మహాకవి జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను.
— YS Jagan Mohan Reddy (@ysjagan) September 28, 2022
సంబంధిత వార్తలు