
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.
సాక్షి, అమరావతి: రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 21వ తేదీ గురువారం ఉదయం 9 గంటలకు శాసనసభ, 10 గంటలకు శాసన మండలి సమాశాలు మొదలవ్వనున్నాయి. అదే రోజు శాసనసభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశమై.. శాసనసభ, శాసనమండలి సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలి.. ఏయే అంశాలపై చర్చించాలనే విషయాన్ని ఖరారు చేయనుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉద్యోగులకు సంబంధించి తీసుకున్న నిర్ణయాలను శాసన సభలో బిల్లుల రూపంలో ప్రవేశపెట్టి చట్ట సవరణలు చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర కల్పించేందుకు ఉద్ధేశించిన బిల్లును ప్రవేశ పెట్టి చట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఈ సమావేశాల్లోనే వ్యవసాయ పరిస్థితులు తదితర అంశాలను చర్చించాలని ప్రభుత్వం భావిస్తోంది.
చదవండి: ‘రాజధానిగా తక్కువ ఖర్చుతో వైజాగ్ పూర్తవుతుంది’