'మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే 21 కోట్లతో అభివృద్ధి' | Anam Ramanarayana Reddy Comments on Muncipal Elections | Sakshi
Sakshi News home page

'మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే 21 కోట్లతో అభివృద్ధి'

Feb 15 2021 3:38 PM | Updated on Feb 15 2021 3:38 PM

Anam Ramanarayana Reddy Comments on Muncipal Elections - Sakshi

సాక్షి,నెల్లూరు :  ఆంధ్రప్రదేశ్‌లో మున్సిపల్‌ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి మాట్లాడారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ  అధికారంలోకి వచ్చి సుమారు రెండు సంవత్సరాలు కావస్తోంది. గత ప్రభుత్వాల కన్నా వైసీపీ ప్రభుత్వం ఎంతో మెరుగ్గా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని ఆయన తెలిపారు. 'మున్సిపాలిటీ పరిధిలో ఇప్పటికే 21 కోట్లతో అభివృద్ధి పనులు చేశాము. త్రాగునీరు, వైద్యం వంటి మౌలిక వసతుల కోసం మరిన్ని నిధులు మంజూరు అయ్యాయి. మున్సిపల్ ఎన్నికల అనంతరం ఆ అభివృద్ధి పనులు కూడా ప్రారంభం అవుతాయి' అని ఎమ్మెల్యే పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రజలందరూ వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టాలని ఆయన విఙ్ఞప్తి చేశారు. (ఏపీలో మున్సిపల్‌ ఎన్నికల షెడ్యూల్ విడుదల)

Advertisement
 
Advertisement
Advertisement