‘అప్పుడు మైనార్టీలకు అన్యాయం జరిగినా ఎల్లో మీడియా సైలెంట్‌గా ఉంది’

Amzath Basha Shaik Bepari Serious Over TDP And Yellow Media - Sakshi

సాక్షి, వైఎస్సార్ జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషా ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మైనార్టీలకు చంద్రబాబు చేసిందేమీ లేదని స్పష్టం చేశారు. కాగా, అంజాద్‌ బాషా మీడియాతో మాట్లాడుతూ.. ‘టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు కేబినెట్‌లో మైనార్టీకు స్థానం కూడా ఇవ్వలేదు. మైనార్టీలను చంద్రబాబు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూశారు. అప్పట్లో మైనార్టీలకు అన్యాయం జరిగినా ఎల్లో మీడియా సైలెంట్‌గా ఉంది. ఇప్పుడు చిలవలు పలవలుగా తప్పుడు ప్రచారం చేస్తోంది. 

రోజురోజుకు అభద్రతా భావంతో చంద్రబాబు లాస్ట్ ఛాన్స్ అని ప్రజలను అడుక్కుంటున్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతూ మభ్యపెడుతున్నారు. మైనార్టీలపై చంద్రబాబు, ఆయన బ్యాచ్ దొంగ ప్రేమ చూపిస్తుంటే బాధగా ఉంది. మైనార్టీలను అన్ని విధాలుగా ముందుకు తీసుకువెళ్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌ రెడ్డి. టీడీపీ హయంలో చంద్రబాబు.. మైనార్టీలకు ఎం చేశాడో, ఏం ఇచ్చాడో ప్రజలకు బాగా తెలుసు. మైనార్టీల సంక్షేమం కోసం 20 వేల కోట్ల రూపాయలు వెచ్చించిన ఘనత మా ప్రభుత్వానిది. వాస్తవ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎల్లో మీడియా కథనాలను ప్రచురించాలి. ఇచ్చిన హామీల్లో 98 శాతం నెరవేర్చిన ఏకైక ప్రభుత్వం మాది’ అని స్పష్టం చేశారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top