ఏపీలో 5 లక్షలు దాటిన కరోనా విజేతలు! | 8702 New Corona Cases Recorded In AP | Sakshi
Sakshi News home page

ఏపీ: ఒక్కరోజే 10,712 మంది డిశ్చార్జ్‌

Sep 17 2020 7:06 PM | Updated on Sep 17 2020 7:26 PM

8702 New Corona Cases Recorded In AP - Sakshi

సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 10,712 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. దీంతో ఇప్పటి వరకు కరోనా నుంచి కోలుకున్నవారి సంఖ్య 5,08,088కి చేరినట్టు వైద్యారోగ్యశాఖ గురువారం విడుదల చేసిన హెల్త్‌ బులెటిన్‌లో పేర్కొంది. గురువారం నాటికి రాష్ట్రవ్యాప్తంగా 48,84,371 టెస్టులు పూర్తయ్యాయి.

గడిచిన 24 గంటల్లో 77,492 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా వీరిలో 8,702 మందికి పాజిటివ్‌గా తేలింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 6,01,462కు చేరింది. గత 24 గంటల్లో 72 మంది మరణించగా మొత్తం మరణాల సంఖ్య 5,177కి చేరింది. ప్రస్తుతం 88,197 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ( వచ్చే ఏడాది ఆరంభంలో కోవిడ్-19 వ్యాక్సిన్‌)

Advertisement
 
Advertisement
Advertisement