ఏపీలో మరింత తగ్గిన యాక్టివ్‌ కేసులు | 8 Lakhs Above Coronavirus Cases Recorded In Andhra Pradesh | Sakshi
Sakshi News home page

ఏపీలో మరింత తగ్గిన కరోనా యాక్టివ్‌ కేసులు

Oct 23 2020 7:35 PM | Updated on Oct 23 2020 7:41 PM

8 Lakhs Above Coronavirus Cases Recorded In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి :  ఏపీలో గడిచిన 24 గంటల్లో 80,238 కరోనా సాంపిల్స్‌ పరీక్షలు నిర్వహించగా.. 3,765 మందికి కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్థారణ అయింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 8,00,684గా ఉంది. ఈ మేరకు ఏపీ వైద్యారోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులెటిన్‌ విడుదల చేసింది. కరోనా నుంచి కొత్తగా 4281 మంది డిశ్చార్జి కాగా.. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 7,62,419గా ఉంది. కరోనాతో కొత్తగా 20 మంది మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6,544కు చేరింది. ఏపీలో ప్రస్తుతం 31,721 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో కరోనా పాజిటివ్‌ రేటు 10.85శాతం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement