సాక్షి,ఢిల్లీ: ఏపీలో డీజిల్ కొరత వెనుక రూ.150 కోట్ల భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. కూటమి ప్రభుత్వం నాలుగు నెలల్లో మూడు కోట్ల లీటర్ల డీజిల్‌ను రిటైల్ అవుట్‌లెట్స్ నుంచి సరఫరా చేయాలని ఆదేశాలు జారీ చేసింది.
అయితే ఈ ఆదేశాల వెనుక వందల కోట్ల స్కాం ఉన్నట్లు బయటపడింది. అమరావతి కాంట్రాక్టర్లకు లాభం చేకూరేలా ప్రభుత్వం ప్రణాళిక వేసింది. దీనిపై కేంద్రం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసి, ఆదేశాలను ఉపసంహరించుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రిటైల్, బల్క్ డీజిల్ ధరల మధ్య వ్యత్యాసం రూ.50. రిటైల్ బంకుల్లో ధర రూ.98 కాగా, బల్క్‌లో రూ.153. రిటైల్ బంకుల నుంచి డీజిల్‌ను రవాణా చేయాలని ప్రభుత్వం సూచించడం ద్వారా ప్రతి లీటర్‌పై రూ.50 లాభం వచ్చేలా నిర్మాణ సంస్థలకు అవకాశం కల్పించింది. ఈ లాభాల్లో వాటాలు పొందేందుకు ఎత్తుగడ వేసినట్లు ఆరోపణలు వెలువడ్డాయి. చివరకు ఈ కుట్ర బహిర్గతమైంది


