వివాహిత అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

వివాహిత అదృశ్యం

May 6 2026 8:25 AM | Updated on May 6 2026 8:25 AM

రాప్తాడురూరల్‌: అనంతపురం రూరల్‌ మండలం ఆలమూరు రోడ్డు కట్టకిందపల్లి క్రాస్‌ సమీపంలో నివాసముంటున్న వివాహిత అరుణకుమారి కనిపించడం లేదు. కళ్యాణదుర్గం ప్రాంతానికి చెందిన అరుణకుమారికి మూడేళ్ల క్రితం కట్టకిందపల్లి గ్రామానికి చెందిన శ్రీకాంత్‌రెడ్డితో వివాహమైంది. ఇద్దరూ కట్టకిందపల్లి క్రాస్‌ కొండారెడ్డి కాంప్లెక్స్‌లో నివాసముంటూ సమీపంలోని ఓ కళాశాలలో పని చేస్తున్నారు. గత నెల 29న ఇంటి నుంచి బయటకు వెళ్లిన అరుణకుమారి తిరిగి రాలేదు. పలు ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఘటనపై శ్రీకాంత్‌రెడ్డి ఫిర్యాదు మేరకు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు అనంతపురం రూరల్‌ పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 93469 17102, 94404 10117 కు సమాచారం ఇవ్వాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement