ఆక్సిటోసిన్ అనే మందును వైద్య రంగంలో ప్రసవ సమయంలో గర్భాశయ కుదుపులను సులభతరం చేయడానికి కానీ, కొన్ని ప్రత్యేక హార్మోన్ అసమతుల్యత సమస్యల పరిష్కారానికి మాత్రమే ఉపయోగిస్తారు. వైద్యుల సిఫారసు లేనిదే ఈ ఇంజక్షన్‌ను విక్రయించరాదు. అయితే పశువుల్లో పాల ఉత్పత్తిని పెంచే ఉద్దేశంతో దీనిని వాడటం సరికాదు, అలాగే నేరం కూడా. ఆక్సిటోసిన్ వాడిన పశువుల పాలు తాగిన చిన్నారుల్లో పలు అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదముంది. ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పశువులకు ఆక్సిటోసిన్ ఇంజక్షన్‌ను ఇవ్వడం మానుకోవాలి.
– డాక్టర్ హేమలత, ఆర్‌ఎంఓ,
జీజీహెచ్, అనంతపురం


