ఆగిపోతూ.. అవస్థలు పెడుతూ | - | Sakshi
Sakshi News home page

ఆగిపోతూ.. అవస్థలు పెడుతూ

May 4 2026 7:43 AM | Updated on May 4 2026 7:43 AM

కూడేరు: చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రోజురోజుకూ ఆర్టీసీ సేవలు దిగజారిపోతున్నాయి. కండీషన్‌ లేని ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం ప్రజలకు నరకం చూపుతోంది. ఎక్కడబడితే అక్కడ మొరాయించి ఆగిపోతుండడంతో చుక్కలు కనబడుతున్నాయి. ఆదివారం రాత్రి అనంతపురం నుంచి ఉరవకొండకు బయలుదేరిన ఆర్టీసీ బస్సు కూడేరు సమీపంలో గిపోయింది. ఇంజిన్‌ వద్ద ఫ్యాన్‌ బెల్టు తెగిపోవడంతో ఇలా జరిగినట్లు తెలిసింది. ఆ సమయంలో బస్సులో 40 మంది దాకా ప్రయాణికులు ఉన్నారు. బస్సు ఆగిపోవడంతో వారంతా ఇబ్బంది పడ్డారు. చాలా సమయం తర్వాత మరో బస్సు రాగా అందులో ఎక్కి వెళ్లారు. ప్రభుత్వం స్పందించి కండీషన్‌ ఉన్న బస్సులను నడపాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement