ఉపాధి కల్పనలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం | - | Sakshi
Sakshi News home page

ఉపాధి కల్పనలో చంద్రబాబు ప్రభుత్వం విఫలం

May 4 2026 7:43 AM | Updated on May 4 2026 7:43 AM

ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్‌కుమార్‌

అనంతపురం అర్బన్‌: చంద్రబాబు ప్రభుత్వం యువతకు ఉపాధి కల్పనలో విఫలమైందని ఏఐవైఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.సంతోష్‌కుమార్‌ విమర్శించారు. ఆదివారం స్థానిక నవయుగ కాలనీలో ఏఐవైఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి సంతోష్‌కుమార్‌తో పాటు ఏఐవైఎఫ్‌ జిల్లా మాజీ నాయకుడు చిరుతల మల్లికార్జున హాజరై, సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. దేశ స్వాతంత్రోద్యమంలో కీలక పాత్ర పోషించిన భగత్‌సింగ్‌, రాజ్‌గురు, సుఖదేవ్‌ థాపర్‌, అల్లూరి సీతారామరాజు లాంటి గొప్ప వీరులు నేటి యువతకు మార్గదర్శకమన్నారు. యువతకు ఉపాధి కల్పించడంలో, ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ప్రభుత్వ విధానాలు, ప్రైవేటీకరణ, ఒప్పంద ఉద్యోగాలపై ఆధారపడుతూ యువత భవిష్యత్తు అస్థిరతలోకి నెట్టబడుతోందన్నారు. వైద్యరంగాన్ని ప్రైవేటీకరిస్తూ ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలను దూరం చేస్తోందని విమర్శించారు. ఎన్నికల సమయంలో యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా యువతను మోసం చేసిందన్నారు. యువతకు గౌరవప్రదమైన ఉపాఽధి కల్పన, నిరుద్యోగ భృతి అమలు, ఉద్యోగ ఖాళీల భర్తీకి ఆందోళలు, పోరాటాలు సాగించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కార్యక్రమంలో నాయకులు రాజు, రాంబాబు, నిఖిల్‌, తేజ, రియాజ్‌, అశోక్‌, గణేష్‌ర నానీ పాల్గొన్నారు.

తరిమెల అమరనాథరెడ్డి

కథలు విలక్షణం

అనంతపురం కల్చరల్‌: తరిమెల అమరనాథరెడ్డి రచనలు విలక్షణంగా ఉంటాయని వక్తలు పేర్కొన్నారు. ఆదివారం అమరనాథరెడ్డి రచించిన ‘చేదు నిజాలు’ పుస్తకాన్ని స్థానిక ఎస్‌ఎస్‌బీఎన్‌ కళాశాల ఆడిటోరియంలో ఆవిష్కరించారు. నిర్వాహకులు మానవత కోకన్వీనర్‌ సలీంమాలిక్‌ పరిచయ కార్యక్రమంతో ప్రారంభమైన సమావేశానికి సీనియర్‌ కవి తూముచర్ల రాజారామ్‌ అధ్యక్షత వహించారు. కమ్యూనిస్టు కుటుంబానికి చెందిన వీకే అరుణమ్మ పుస్తకాన్ని ఆవిష్కరించారు. కృతి స్వీకర్త జిడ్డు కృష్ణమూర్తి ట్రస్టు జాతీయ కార్యదర్శి ఎల్లూరి విశ్వనాథ్‌, కవులు మహాబోధి కృష్ణమూర్తి, మురళీకృష్ణ, గేట్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజ్‌ డైరెక్టర్‌ పద్మావతి తదితరులు కమ్యూనిస్టుల త్యాగనిరతితో కూడిన కుటుంబాలపై, తరిమెల నాగిరెడ్డి త్యాగమయ జీవితం గురించి మాట్లాడారు. అదే నేపథ్యమున్న అమరనాథరెడ్డి కథలలో ఎక్కడా కాల్పనికత ఉండదని నేటి సమాజంలో జరుగుతున్న అవకతవకలు అవలక్షణాలు, వాస్తవాలకు ప్రతిరూపంగా చేదు నిజాలున్నాయని కొనియాడారు. శివశంకరనాయుడు రాసిన గీతం ఆకట్టుకుంది. కార్యక్రమంలో ఆర్డీటీ ఎకాలజీ సెంటర్‌ డైరెక్టర్‌ మల్లారెడ్డి, మాజీ డిప్యూటీ మేయర్‌ కోగటం విజయభాస్కరరెడ్డి, సంపాదకులు తోట నాగరాజు, నరిసిరెడ్డి, మానవహక్కుల వేదిక రాష్ట్ర నాయకులు ఎస్‌ఎం బాషా, రియాజుద్దీన్‌, గోవిందరాజులు, నవీన్‌కుమార్‌, కవయిత్రి డాక్టర్‌ అనంత మాలతి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement