గుంతకల్లుటౌన్: పట్టణంలోని ఆలూరురోడ్ విద్యానగర్–1 క్రాస్ దగ్గర కేబుల్ పనుల కోసం తవ్విన గోతి వద్ద బైక్ అదుపు తప్పి రామిరెడ్డి కాలనీకి చెందిన ట్యాంకర్ డ్రైవర్ ఉప్పర ప్రసాద్ (52) ఆదివారం మృతి చెందాడు. వన్‌టౌన్ సీఐ మనోహర్ తెలిపిన మేరకు.. ఆయిల్ ట్యాంకర్‌ను నడుపుతూ జీవనం సాగిస్తున్న ప్రసాద్.. బర్మాశాలలో మృతి చెందిన తన స్నేహితుడి మృతదేహాన్ని సందర్శించి బుధవారం రాత్రి 11:30 గంటల సమయంలో తిరిగి తన బైక్‌పై ఇంటికి బయల్దేరాడు. విద్యానగర్ క్రాస్–1 వద్ద ఓఎఫ్‌సీ కేబుల్ కోసం తవ్విన గుంత దగ్గర మట్టి, కంకర అడ్డుగా వేయడంతో అదుపుతప్పి గోతిలో పడ్డాడు. స్థానికులు అతన్ని స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రసాద్ ఆదివారం వేకువజామున మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య మంజుల, ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య మంజుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.


