● వైఎస్సార్‌టీయూ జిల్లా అధ్యక్షుడు ఓబిరెడ్డి
అనంతపురం: తన ఐదేళ్ల పాలనలో కార్మికులు, కర్షకులు, ఉద్యోగుల పక్షపాతిగా వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఖ్యాతిగాంచారని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.ఓబిరెడ్డి అన్నారు. కార్మిక దినోత్సవం సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో శుక్రవారం మే డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ట్రేడ్ యూనియన్ జెండాను ఆవిష్కరించారు. హక్కుల సాధనలో భాగంగా అమరులైన కార్మికులకు నివాళులు అర్పించారు. అనంతరం ఓబిరెడ్డితో పాటు జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, మాజీ మేయర్ వసీం, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీసీ రమేష్ గౌడ్, సంయుక్త కార్యదర్శి వెన్నం శివారెడ్డి, ఎస్‌ఈసీ సభ్యుడు కోగటం విజయభాస్కరరెడ్డి, నగర అధ్యక్షుడు చింతా సోమశేఖరరెడ్డి, ట్రేడ్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొర్రపాడు హుస్సేన్ పీరా, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, యువజన విభాగం రాష్ర ప్రధాన కార్యదర్శి ఉమ్మడి మదన్‌మోహన్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, మున్సిపల్ కార్మికులు అడగకముందే వారి జీతాలను రెట్టింపు చేసిన ఖ్యాతి మాజీ సీఎం వైఎస్ జగన్‌కు దక్కుతుందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేసి కార్మికులకు ఉద్యోగ భద్రతను కల్పించారన్నారు. కార్మిక లోకం ఎన్నో ఏళ్లుగా పోరాడి సాధించుకున్న హక్కులను ఎన్డీఏ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. కార్మికులకు పని గంటలు 8 ఉండగా.. దానిని పది గంటలకు పెంచారని మండిపడ్డారు. కార్మికులకు మేలు జరగాలంటే ఒక్క వైఎస్సార్‌సీపీతోనే సాధ్యమని పేర్కొన్నారు. బీసీ రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. కార్మికుల కష్టాన్ని శ్రమను చంద్రబాబు ప్రభుత్వం దోపిడీ చేస్తోందని విమర్శించారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం పనిచేసిన ఏకై క పార్టీ వైఎస్సార్‌సీపీనే అని కొనియాడారు. కార్యక్రమంలో ట్రేడ్ యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంపంగి రామాంజినేయులు, రాజారత్నం, జిల్లా కార్యదర్శులు అనిల్‌కుమార్ గౌడ్, రామాంజి రాయల్, కుళ్లాయప్ప, నగర అధ్యక్షుడు ఖాజా, హుస్సేన్, కాకర్ల శ్రీనివాసరెడ్డి, పట్టణ కార్యదర్శి రాజశేఖరరెడ్డి, జానీ, గోగుల రాధాకృష్ణ, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, అమర్‌నాథరెడ్డి, శ్రీనివాసులు, మహిళా విభాగం జిల్లా ఉపాధ్యక్షురాలు రాధాయాదవ్, భారతి, జాహ్నవి రెడ్డి, అంజలి, కళావతి, వెంకటేశ్ రాయల్, సాకే చిరంజీవి, గుజ్జల నారాయణ, శశి, నవీన్ కుమార్, విశ్వతేజ, రమణ, శ్రీనివాస రాయల్ పాల్గొన్నారు.


