జీవనోపాధులతో వ్యవస్థాపకులుగా ఎదగాలి | - | Sakshi
Sakshi News home page

జీవనోపాధులతో వ్యవస్థాపకులుగా ఎదగాలి

May 2 2026 7:38 AM | Updated on May 2 2026 7:38 AM

బెళుగుప్ప: డీఆర్‌డీఏ ద్వారా జీవనోపాధులను సద్వినియోగం చేసుకుని ప్రతి ఒక్కరూ వ్యవస్థాపకులుగా ఎదగాలని కలెక్టర్‌ ఆనంద్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం కాలువపల్లి రైతు సేవా కేంద్రంలో 2026–27 వార్షిక సంవత్సరానికి ఏసీఎల్పీ (యాన్యువల్‌ క్రెడిట్‌ లైవ్లీవుడ్‌ ప్లాన్‌) ప్రణాళికపై వీవోఏలు, ఈ–నారీలు, ఎస్‌హెచ్‌జీ సభ్యులతో కలెక్టర్‌ సమావేశమయ్యారు. జీవనోపాధులను ఎలా సద్వినియోగం చేసుకుంటున్నారు.. వ్యవస్థాపకులుగా ఎలా ఎదగాలనుకుంటున్నారు అనే అంశాలపై చర్చించారు. అనంతరం హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్‌ను సందర్శించిన వడదెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నివారణ చర్యలపై అవగాహన కల్పిస్తూ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ సుయాశ్‌కుమార్‌, తహసీల్దార్‌ అనిల్‌కుమార్‌, డీఆర్‌డీఏ ఏపీడీ రాధారాణి, ఇన్‌చార్జ్‌ ఏపీఎం శివప్రసాద్‌, ఎంపీడీఓ లక్ష్మినారాయణ, వైద్యాధికారి హిమబిందు, హెల్త్‌ సూపర్‌వైజర్‌ వెంకటరమణ, తదితరులు పాల్గొన్నారు.

జలధార పనులు సజావుగా చేపట్టండి

జలధార పనులను సజావుగా చేపట్టాలని అధికారులను కలెక్టర్‌ ఆనంద్‌ ఆదేశించారు. శుక్రవారం హనిమరెడ్డిపల్లి వద్ద ఎంఐ ట్యాంకును కలెక్టర్‌ పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement