డ్రంకన్‌ డ్రైవ్‌లో రూ.10వేల జరిమానా | - | Sakshi
Sakshi News home page

డ్రంకన్‌ డ్రైవ్‌లో రూ.10వేల జరిమానా

Apr 29 2026 7:36 AM | Updated on Apr 29 2026 7:36 AM

తాడిపత్రి రూరల్‌: డ్రంకన్‌ డ్రైవ్‌లో పట్టుపడిన ట్రాక్టర్‌ డ్రైవర్‌ నగేష్‌కు రూ.10వేల జరిమానా విధిస్తూ తాడిపత్రి సెకండ్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ ప్రభావతి తీర్పు వెలువరించారు. ఈ మేరకు వివరాలను సీఐ శివగంగాధరరెడ్డి వెల్లడించారు. నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం గొర్విమానిపల్లి గ్రామానికి చెందిన నగేష్‌ మంగళవారం మద్యం మత్తులో ట్రాక్టర్‌ నడుపుతూ పట్టుబడ్డాడన్నారు. దీంతో న్యాయస్థానంలో హాజరుపరిస్తే విచారణ అనంతరం రూ.10 వేల జరిమానాతో పాటు సాయంత్రం వరకూ కోర్టు ప్రాంగణంలో ఉండేలా శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement