గ్రామస్థాయి క్రీడాకారులకు శాప్‌ వెన్నుదన్ను | - | Sakshi
Sakshi News home page

గ్రామస్థాయి క్రీడాకారులకు శాప్‌ వెన్నుదన్ను

Apr 29 2026 7:36 AM | Updated on Apr 29 2026 7:36 AM

అనంతపురం: గ్రామస్థాయిలో ప్రతిభ గల క్రీడాకారులకు శాప్‌ వెన్నుదన్నుగా నిలుస్తుందని శాప్‌ ఎండీ ఎస్‌. భరణి అన్నారు. రాష్ట్రస్థాయి శాప్‌ పుట్‌బాల్‌ పోటీలు మంగళవారం అనంతపురం ఆర్డీటీలో ప్రారంభమయ్యాయి. కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఫుట్‌బాల్‌ క్రీడకు ప్రపంచంలో అత్యధికంగా ఆదరణ ఉందన్నారు. ఫుట్‌బాల్‌లో రాణిస్తే.. మంచి భవిష్యత్తు ఉందని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్పెషల్‌ ఆఫీసర్‌ జగన్నాథ్‌ రెడ్డి, డీఎస్‌డీఓ నంద్యాల ఎంఎన్‌వీ రాజు, డీఎస్‌డీఓ ఎస్‌ఎ మంజుల, కిశోర్‌, సురేంద్రబాబు, జగన్‌మోహన్‌ రావు శ్రీనివాసులు, ఆర్డీటీ డైరెక్టర్‌ సాయి కృష్ణ పాల్గొన్నారు.

● మంగళవారం జరిగిన మ్యాచ్‌ల్లో అండర్‌ –15 బాయ్స్‌ విజేత అనకాపల్లి, గర్‌ల్స్‌ విజేత అన్నమయ్య జిల్లా, అండర్‌– 21 బాయ్స్‌ విజేత కృష్ణ, గర్‌ల్స్‌ విజేత–అనంతపురం జట్టు నిలిచాయి. ఈ నెల 30న టోర్నీ ముగియనుంది.

Advertisement
 
Advertisement
Advertisement