15 లోపు డ్రిప్‌ సరఫరా చేయాలి | - | Sakshi
Sakshi News home page

15 లోపు డ్రిప్‌ సరఫరా చేయాలి

Apr 29 2026 7:36 AM | Updated on Apr 29 2026 7:36 AM

కంపెనీ ప్రతినిధులకు ఏపీఎంఐపీ పీడీ ఆదేశం

అనంతపురం అగ్రికల్చర్‌: మార్చితో ముగిసిన 2025–26కు సంబంధించి మంజూరు ఉత్తర్వులు జారీ చేసిన రైతులకు డ్రిప్‌ పరికరాలు మే 15వ తేదీలోపు సరఫరా చేయాలని సంబంధిత డీసీఓలను ఏపీఎంఐపీ పీడీ బి.రఘునాథరెడ్డి ఆదేశించారు. డ్రిప్‌ సరఫరాపై మంగళవారం తన కార్యాలయంలో ఏపీడీ ధనుంజయతో కలిసి డ్రిప్‌ కంపెనీ డీసీఓలతో పీడీ సమీక్షించారు. గత ఏడాది 23వేల హెక్టార్లకు డ్రిప్‌ మంజూరు చేయగా, 20 వేల హెక్టార్లకు పంపిణీ చేశారని, మిగిలిన 3 వేల హెక్టార్లకు పరికరాలు పొలాల్లో బిగించాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement