సీమ ప్రజలు మేల్కోవాలి | - | Sakshi
Sakshi News home page

సీమ ప్రజలు మేల్కోవాలి

Apr 28 2026 7:35 AM | Updated on Apr 28 2026 7:35 AM

ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఒకప్పుడు 1,500 అడుగుల లోతులో ఉన్న భూగర్భ జలాలను హంద్రీ–నీవా కాలువ ద్వారా 600 అడుగుల పైకి తీసుకొచ్చాం. నేడు కమీషన్ల కక్కుర్తితో చంద్రబాబు కాంక్రీట్‌ లైనింగ్‌ పనులు చేయించి భూగర్భ జలాలు అడుగంటేలా చేశారు. రాయలసీమ లిఫ్ట్‌ ఇరిగేషన్‌తో సీమను సస్యశ్యామలం చేయాలనుకున్న వైఎస్‌ జగన్‌ ఆశయాలకు చంద్రబాబు తూట్లు పొడుస్తున్నారు. ఈ పథకం రాకుంటే రానున్న రోజుల్లో తాగునీటి సమస్య తీవ్రమవుతుంది. తెలంగాణ సీఎంతో రహస్య ఒప్పందం చేసుకోవడం సిగ్గుచేటు. మనకు కావాల్సింది నీళ్లు కానీ అమరావతి, హాంకాంగ్‌, సింగపూర్‌ గ్రాఫిక్స్‌ కాదు. సీమ ప్రజలు మేల్కోవాలి.

– దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే

Advertisement
 
Advertisement
Advertisement