రాయలసీమలో నీళ్ల అవసరాలు తీర్చేందుకు హంద్రీ–నీవాను వైఎస్సార్ పూర్తి చేశారు. అప్పట్లోనే కుప్పం వరకు నీళ్లు తీసుకెళ్లారు. కమీషన్ల కక్కుర్తితో కాలువలో లైనింగ్ పనులు చేయించి అంతా తానే చేసినట్లు చంద్రబాబు చెబుతున్నారు. సీమలో నీటి ఆవశ్యకత గురించి టీడీపీ నాయకులకు ఏమీ తెలియదని అర్థమవుతోంది. ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్’ ఆపేందుకు చంద్రబాబు ఒప్పుకున్నారని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో చెప్పడం బాబు ద్రోహానికి నిదర్శనం. స్వార్థ రాజకీయాల కోసం రాయలసీమ ప్రజల హక్కులను టీడీపీ కాలరాస్తోంది. ఈవీఎంలతో గెలిచారు కనుకనే ప్రజా ప్రయోజనాలతో ఏం పని అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. – వై.విశ్వేశ్వరరెడ్డి, ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే


