రాయలసీమ విషయంలో వైఎస్సార్ ఆశయాలను కొనసాగించడమే లక్ష్యంగా ముందుకెళ్తాం. ఇక్కడి ప్రజల కష్టాలను తెలుసుకున్న వైఎస్ జగన్ పోతిరెడ్డిపాడు వద్ద రాయలసీమ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టారు. రైతులకు మంచి చేయాలని వైఎస్ కుటుంబం ఎప్పుడూ చూస్తుంది. కానీ చంద్రబాబు ఆ దిశగా వెళ్లకపోవడం బాధాకరం. పోలవరం ఎత్తు తగ్గించడం, రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదాను ప్యాకేజీలకు త్యాగం చేయడమే చంద్రబాబు రాజకీయం. పాలమూరు – రంగారెడ్డి ద్వారా రోజుకు 8 టీఎంసీల నీళ్లు ఎత్తుకెళ్లిపోతున్నారు. హంద్రీ–నీవా కాలువను వెడల్పు చేసి ఎక్కువ నీళ్లు తేకుండా కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చి కమీషన్లు దండుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు లైనింగ్ పనులు చేశారు. – తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే


