అనంతపురం ఎడ్యుకేషన్: పునాది దశ నుంచే పిల్లల్లో అభ్యసనం పటిష్టంగా ఉండాలని ఐసీడీఎస్ సిబ్బందిని పీడీ శశికళ ఆదేశించారు. ప్రీ ప్రైమరీ స్థాయిలో అభ్యసన పటిష్టం చేయడానికి ఉమ్మడి జిల్లా పరిధిలోని మండల స్థాయిలో రిసోర్స్ పర్సన్లుగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ టీచర్లు, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లకు అనంతపురం నగర శివారు పంగల్‌రోడ్డులో ఉన్న ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో 6 రోజుల పాటు జరిగే ‘జ్ఞానజ్యోతి’ శిక్షణను సోమవారం ఆమె ప్రారంభించి, మాట్లాడారు. సమగ్ర శిక్ష ఏఎంఓ వేణుగోపాల్ మాట్లాడుతూ పిల్లల అభ్యాసనకు ప్రీ ప్రైమరీ దశ చాల ముఖ్యమైందన్నారు. ఆ దశలో వారు నేర్చుకునే విధానం బాగుంటే భవిష్యత్తులో అభ్యసన పటిష్టంగా ఉంటుందన్నారు. ఈ శిక్షణ ద్వారా మండల స్థాయిలో అంగన్‌వాడీ టీచర్లు పటిష్టమైన బోధనను అందించడానికి దోహరపడుతుందన్నారు. శ్రీసత్యసాయి జిల్లా సమగ్ర శిక్ష ఏఎంఓ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. డీఆర్పీలు శిక్షణా కార్యక్రమం సద్వినియోగం చేసుకుని క్షేత్రస్థాయిలో విద్యార్థులకు ఉపయోగకరంగా ఉండేలా చూడాలని కోరారు.
ఐసీడీఎస్ పీడీ శశికళ


