బీసీలంటే బ్యాక్ బోన్ అని చాటిన నాయకుడు మాజీ సీఎం వైఎస్ జగన్. 2019 ఎన్నికల్లో బీసీల సంక్షేమం కోసం ఏటా రూ.15 వేల కోట్లు కేటాయిస్తానని చెప్పారు. అధికారంలోకి వచ్చిన తరువాత ఐదేళ్లలో ఏకంగా రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేసి రికార్డు సృష్టించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా 24 మంది మంత్రులలో 11 మంది బీసీలకు చోటు కల్పించారు. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బీసీలకు అవకాశం కల్పించి సామాజిక విప్లవానికి వైఎస్ జగన్ నాంది పలికారు. డైవర్షన్ పాలిటిక్స్‌తో కాలం నెట్టుకొస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపి జనరంజక పాలన కోసం జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది.
– అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు


