బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. బీసీల అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారు. ఆయన హయాంలో సంక్షేమ పథకం అందని ఇల్లు ఏదైనా ఉందా? సామాజిక, రాజకీయంగా, ఆర్థికంగా బీసీలను ఆదుకునే పార్టీ వైఎస్సార్‌సీపీ. బీసీల కోసం పదవులను సైతం త్యాగం చేసిన గొప్ప వారు ఈ వేదిక మీదే ఉండడం గర్వకారణం. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం బీసీల హామీలను తుంగలో తొక్కి.. రెడ్‌బుక్ పేరుతో అక్రమ కేసులు పెట్టి అణచివేస్తోంది. రానున్న రోజుల్లో బీసీలందరూ ఏకమై జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేసుకుంటేనే బీసీలకు సరైన న్యాయం జరుగుతుంది.
– రమేష్‌గౌడ్, వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్


