అరటి రైతు ఆర్తనాదాలు చేస్తున్నా చంద్రబాబు సర్కారుకు చీమ
నాడు.. కరోనా కాలంలో రైతుల దగ్గరుండి అరటి ఉత్పత్తులు అమ్మకాలు సాగిస్తున్న ఆర్‌ఎస్‌కే అసిస్టెంట్లు (ఫైల్)
అనంతపురం అగ్రికల్చర్: 2021 నుంచి 2024 మధ్య టన్ను రూ.20 వేల నుంచి రూ.25 వేల వరకు మంచి ధరలు పలకడంతో చాలా మంది రైతులు అరటి సాగుపై దృష్టి సారించారు. ఈ ఏడాది 39 వేల ఎకరాల్లో అరటి సాగులో ఉండగా 7 లక్షల మెట్రిక్ టన్నుల వరకు దిగుబడులు అంచనా వేశారు. అందులో మొదటి పంట కింద డిసెంబర్ నుంచి కోతలు మొదలు కానుండగా... 3.92 లక్షల మెట్రిక్ టన్నులు రావొచ్చని అంచనా వేశారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా రెండు, మూడో విడత పంట కోతలు జరుగుతున్నాయి. కానీ నెల రోజులుగా టన్ను రూ.2 వేలకు మించి పలకకపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. మూడో విడత పంట అయితే టన్ను రూ.400 నుంచి రూ.500 కూడా అడగడం లేదని రైతులు వాపోతున్నారు. కష్టకాలంలో చేయూత ఇవ్వాల్సిన చంద్రబాబు సర్కారు అరటి రైతు గురించి కనీస ఆలోచన చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
జగన్ సర్కారు వెన్నుదన్ను..
2020 ఫిబ్రవరిలో కరోనా విపత్తు సంభవించిన విషయం తెలిసిందే. కోవిడ్ మహమ్మారి విలయతాండవంతో దేశవ్యాప్తంగా రవాణా స్తంభించిపోగా, ప్రధాన మార్కెట్లు నిరవధికంగా మూతబడ్డాయి. అంతటి కష్టకాలంలో కూడా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సర్కారు అన్నదాతకు అడుగడుగునా అండగా నిలిచింది. దేశంలో మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా చేయనంత స్థాయిలో రైతుల్లో మనోధైర్యం నింపి ఉద్యాన ఉత్పత్తుల అమ్మకాలు జరిగేలా చర్యలు తీసుకుంది. ప్రభుత్వ యంత్రాంగం, ఆర్‌బీకే సిబ్బంది, వలంటీర్లు, ఇతరత్రా అన్ని శాఖలను సమన్వయం చేసి వెన్నుదన్నుగా నిలిచింది. అప్పట్లో ఉద్యాన ఉత్పత్తుల అమ్మకాలకు ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాలు, ఉత్తరాది ప్రాంతాలకు పండ్ల ఉత్పత్తులు రవాణా చేశారు. 2020 ఏప్రిల్ నుంచి ఆగస్టు వరకు ఐదు నెలల కరోనా కాలంలో జిల్లాలో రైతులు పండించిన అన్ని రకాల పండ్ల ఉత్పత్తులు 10 లక్షల టన్నులకు పైగా క్రయ విక్రయాలు జరిగినట్లు ఉద్యాన శాఖ నివేదిక వెల్లడిస్తుండడం గమనార్హం. మొదట్లో ధరల తగ్గుదల, కఠిన నిబంధనలతో కొంత ఇబ్బందులు పడినా రానురాను పరిస్థితి మెరుగుపడటంతో ఢిల్లీలోని అజాద్‌పూర్ మార్కెట్‌తో పాటు హైదరాబాద్, చైన్నె, బెంగళూరు, నాగపూర్ లాంటి దక్షిణాది రాష్ట్రాల మార్కెట్లకు జిల్లా నుంచి చీనీ, మామిడి, అరటి, బొప్పాయి, మెలన్స్, ద్రాక్ష, దానిమ్మ లాంటి పంట ఉత్పత్తులు రవాణా చేశారు. సరాసరి ధరల ప్రకారం కరోనా కాలంలో రూ.1,400 కోట్ల విలువ చేసే ఫలసాయం అమ్మకాలు సాగించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
అప్పట్లో పత్తాలేని బాబు బ్యాచ్..
2020 మార్చి నుంచి అదే ఏడాది ఆగస్టు వరకు కరోనా మహమ్మారి కారణంగా రైతులు అవస్థలు పడుతున్న సమయంలో చంద్రబాబు బ్యాచ్ పత్తాలేకుండా పోయింది. సాయం కోసం రైతులు దిక్కులు చూస్తున్న సమయంలో కనీసం పలకరించి మనోధైర్యం చెప్పాల్సిన చంద్రబాబు రాష్ట్రం వైపు కన్నెత్తి చూడకుండా హైదరాబాద్‌లో ఉండి పోవడం సర్వత్రా విమర్శలకు తావిచ్చింది.
‘కరోనా’ కష్టాల్లోనూ అన్నదాతకు వైఎస్ జగన్ సర్కారు వెన్నుదన్ను
లాక్‌డౌన్లతో మార్కెట్లు మూతపడినా ఉద్యాన రైతుకు చేయూత
2020లో ప్రభుత్వం, పాలనా యంత్రాంగం దగ్గరుండి
రైతు ఉత్పత్తులకు మార్కెటింగ్
నేడు అరటి రైతులు ఆర్తనాదాలు చేస్తున్నా పట్టించుకోని
చంద్రబాబు ప్రభుత్వం
అరటి రైతు ఆర్తనాదాలు చేస్తున్నా చంద్రబాబు సర్కారుకు చీమ


