షోకాజ్‌కు వివరణ ఇచ్చేందుకు వస్తే ‘క్లాస్’ పీకిన డీఈఓ
అనంతపురం సిటీ: షోకాజ్ నోటీసుకు వివరణ ఇచ్చేందుకు వచ్చిన కణేకల్లు మండలం ఎర్రగుంట్ల ఉన్నత పాఠశాలకు చెందిన గ్రేడ్–2 హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్‌కు డీఈఓ ప్రసాద్‌బాబు ‘క్లాస్’ పీకారు. గురువారం ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే... భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అమరావతిలో మాక్ అసెంబ్లీ నిర్వహణకు ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ప్రతిభ ఆధారంగా ఒక్కో నియోజకవర్గం నుంచి ముగ్గురు చొప్పన విద్యార్థులను ఎంపిక చేసి రాష్ట్ర శాఖ కార్యాలయానికి జిల్లా విద్యాధికారులు పంపారు. అయితే రాయదుర్గం నియోజకవర్గం నుంచి రెండో పేరుగా ఉన్న విద్యార్థిని ఎంపిక చేయడాన్ని ఆక్షేపిస్తూ మొదటి పేరు విద్యార్థి తల్లిదండ్రులు... కణేకల్లు మండలం ఎర్రగుంట్ల పాఠశాల ఉపాధ్యాయులను నిలదీశారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ఆ పాఠశాల హెడ్మాస్టర్, స్కూల్ అసిస్టెంట్‌కు షోకాజ్ నోటీసులు జారీ అయ్యాయి. దీంతో సంజాయిషీ ఇచ్చేందుకు గురువారం కార్యాలయానికి చేరుకున్న వారిని డీఈఓ తీవ్ర స్థాయిలో మందలించినట్లు సమాచారం. కాగా, ఇదే అంశంపై తమ పాఠశాలలో మొదటి, రెండో స్థానంలో కాకుండా మూడో స్థానంలో ఉన్న విద్యార్థిని ఎలా ఎంపిక చేశారంటూ డీఈఓ కార్యాలయానికి చేరుకొని ప్రశ్నించిన తపోవనం పాఠశాల హెడ్మాస్టర్, మరో ఇద్దరు ఉపాధ్యాయులను విద్యాశాఖ అధికారులు గురువారం విజయవాడలోని కమిషనర్ విజయరామారావు వద్ద హాజరు పరిచారు.
కంబదూరు పంచాయతీ కార్యదర్శిపై వేటు
రాప్తాడు రూరల్: కంబదూరు పంచాయతీ కార్యదర్శి అశ్వత్థరెడ్డిని సస్పెండ్ చేస్తూ జిల్లా పంచాయతీ అధికారి నాగరాజు నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. స్వర్ణ పంచాయతీ పోర్టల్‌లో సెల్ నంబర్లు, ఆధార్ అప్‌డేషన్ అంశంపై గురువారం పంచాయతీరాజ్ కమిషనర్ అన్ని జిల్లాల పంచాయతీ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. అసెస్‌మెంట్ల పోర్టల్‌లో మొబైల్ నంబర్లు నమోదు చేయడంలో అలసత్వం వహించిన కార్యదర్శులపై చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. ఈ క్రమంలో దాదాపు 200 అసెస్‌మెంట్లకు ఒకే మొబైల్ నంబరు నమోదు చేసిన అశ్వత్థరెడ్డిన సస్పెండ్ చేస్తూ డీపీఓ ఉత్తర్వులు చేశారు.
నేడు పదోన్నతుల కౌన్సెలింగ్ : జిల్లాలో అర్హులైన 120 గ్రేడ్–6 పంచాయతీ కార్యదర్శులకు గ్రేడ్–5 కార్యదర్శులుగా పదోన్నతులు కల్పించేందుకు శుక్రవారం కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటలకు డీపీఓ కార్యాలయంలో కౌన్సెలింగ్ ఉంటుందని డీపీఓ నాగరాజునాయుడు తెలిపారు.
నేటి నుంచి స్కూల్ బస్సులపై స్పెషల్ డ్రైవ్ : డీటీసీ
అనంతపురం సెంట్రల్: ప్రైవేటు స్కూల్, కళాశాలలకు చెందిన బస్సులపై శుక్రవారం నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకూ స్పెషల్‌డ్రైవ్ చేపట్టనున్నట్లు జిల్లా ఉపరవాణా కమిషనర్ (డీటీసీ) వీర్రాజు తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ... భద్రతాపరమైన అంశంలో ఏవైనా లోపాలుంటే సవరణ చేసుకోవాలని ఇప్పటికే ఆయా యాజమాన్యాలకు నోటీసులు పంపినట్లు వివరించారు.
ఉచిత శిక్షణకు దరఖాస్తు గడువు పొడిగింపు
అనంతపురం సిటీ: యూపీఎస్సీ నిర్వహించే సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షకు సంబంధించి బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ దరఖాసుకు గడువును డిసెంబర్ 3వ తేదీ వరకు పొగించారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ కుష్బూ కొఠారి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాలకు 95502 50770, 97042 04905 నంబర్లలో సంప్రదించవచ్చు.
29న నార్పలలో జాబ్‌మేళా
శింగనమల(నార్పల): జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నార్పలలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 29న జాబ్‌మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డేవిడ్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి ప్రతాప్‌రెడ్డి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. జాతీయ స్థాయిలోని పది ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరై.. ఆయా కంపెనీల అవసరాలకు అనుగుణంగా మానవ వనరులను ఎంపిక చేయనున్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, పీజీ చదివిన వారు అర్హులు.
షోకాజ్‌కు వివరణ ఇచ్చేందుకు వస్తే ‘క్లాస్’ పీకిన డీఈఓ
షోకాజ్‌కు వివరణ ఇచ్చేందుకు వస్తే ‘క్లాస్’ పీకిన డీఈఓ


