తాడిపత్రి టౌన్: స్థానిక విజయలక్ష్మి థియేటర్ సమీపంలో ఐదుగురు మట్కా బీటర్లను తాడిపత్రి పట్టణ సీఐ ఆరోహణరావు, ఎస్‌ఐ గౌస్ మహమ్మద్ గురువారం అరెస్ట్ చేశారు. పట్టుబడిన వారిలో మేకల పుల్లయ్య, దూదేకుల కుళ్లాయప్ప, లింగుట్ల కొండమనాయుడు, ఉదయగిరి మాబున్నీ, షేక్ రహమత్ ఉన్నారు. వీరి నుంచి రూ.2.01 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఏఎస్పీ రోహిత్‌కుమార్ మాట్లాడుతూ.. తాడిపత్రిలో జూదాల కట్టడికి పటిష్ట చర్యలు తీసుకున్నామన్నారు. పేకాట, మట్కా నిర్వాహకుల కుటుంబాలతో పాటు వారి సమీప బందువుల వివరాలనూ సేకరించామన్నారు. వారి బ్యాంక్ ఖాతాలపై నిఘా ఉంచామని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినట్లుగా తేలితే కఠిన చర్యలు తప్పవన్నారు.ఒకవేళ కుటుంబ సభ్యులు, బంధువులు విదేశాల్లో ఉంటే వారి పాస్‌పోర్టులను సీజ్ చేస్తామని హెచ్చరించారు.
ఉపాధి పనులపై
సామాజిక తనిఖీ
అనంతపురం టౌన్: ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన పనులపై సామాజిక తనిఖీలు చేపట్టనున్నట్లు డ్వామా పీడీ సలీంబాషా తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. 2024–25ఆర్థిక సంవత్సరానికి గాను ఉరవకొండ, రాయదుర్గం నియోజకవర్గాల పరిధిలోని 10 మండలాల్లో రూ.80 కోట్లతో ఉపాధి పనులు చేపట్టిన డ్రైల్యాండ్ హార్టికల్చర్, కందకాల తవ్వకాలు, చెరువుల్లో పూడికతీత పనులు, సీసీరోడ్లు, డ్రైయినేజీ తదితర పనులపై సామాజిక తనిఖీలు ఉంటాయన్నారు. 20 రోజుల పాటు సాగే ఈ ప్రక్రియకు ఆయా గ్రామ పంచాయతీల్లోని ఉపాధి కూలీలు సహకరించాలని కోరారు.
ఎస్‌జీఎఫ్ జాతీయ
స్థాయి క్రీడలకు ఎంపిక
గుంతకల్లు: ఉత్తరప్రదేశ్‌లోని లక్నో వేదికగా డిసెంబర్ 13 నుంచి 15వ తేదీ వరకూ జరిగే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు గుంతకల్లులోని సరస్వతీ జూనియర్ కళాశాల ఫస్ట్ ఇయర్ విద్యార్థి టి.రాజేష్ ఎంపికయ్యాడు. ఈ మేరకు కోచ్ దొరై గురువారం వెల్లడించారు. జాతీయ స్థాయిలో జరిగే 200, 400 మీటర్ల పరుగు పోటీలతో పాటు వంద మీటర్ల రిలే పరుగు పోటీల్లో అండర్–17 విభాగంలో ఏపీ తరఫున రాజేష్ ప్రాతినిథ్యం వహించనున్నాడు.
మట్కా బీటర్ల అరెస్ట్


