విద్యార్థులే కూలీలుగా మారి..
ఉరవకొండ: స్థానిక ఎస్‌కే ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు ఇటుకలు, మట్టి మోస్తూ బుధవారం కూలీలుగా కన్పించారు. తరగతి గదుల్లో ఉంటూ చదువుకోవాల్సిన సమయంలో వారితో ఇటుకలు, మట్టిని ఆ పాఠశాల హెచ్‌ఎం, ఉపాధ్యాయులు మోయించారు. ఇది చూసిన పలువురు ఆశ్చర్యపోయారు. తమ పిల్లలను ప్రయోజకులుగా చూడాలన్న ఉద్దేశంతో తల్లిదండ్రులు బడులకు పంపితే అక్కడ ఇందుకు భిన్నమైన పరిస్థితులు నెలకొంటున్నాయని అసహనం వ్యక్తం చేశారు.
ఎరువుల దుకాణాల్లో తనిఖీలు
కణేకల్లు: మండల కేంద్రంలోని పలు ఎరువుల దుకాణాలను బుధవారం ఫర్టిలైజర్ స్క్వాడ్ అధికారి సత్యనారాయణ, ఏఓ జగదీష్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఆదర్శ భారతి రైతుసేవా సహకార సంఘంలో ఎరువులకు సంబంధించిన రిజిస్టర్, గోదాములో నిల్వలకు పొంతన లేకపోవడంతో రూ.1.50 లక్షలు విలువ చేసే ఎరువుల విక్రయాల నిలుపుదల చేస్తూ నోటీసు ఇచ్చారు. స్థానిక పీఏసీఎస్‌లో రూ.70వేలు విలువ చేసే ఎరువుల విక్రయాలకు స్టాఫ్ సేల్స్ నోటీసు జారీ చేశారు. మరో ఫర్టిలైజర్ షాపులో రూ.6.59 లక్షలు విలువ చేసే ఎరువుల విక్రయాలను నిలుపుదల చేశారు. గురువారం లోపు సరైన ఇన్వాయిస్‌లు చూపకపోతే రూ.2.49 లక్షల విలువైన ఎరువులను జప్తు చేస్తామని సంబంధిత యజమానిని అధికారులు హెచ్చరించారు.
విద్యార్థులే కూలీలుగా మారి..


