ఎర్రవంక మాయం
సాక్షి టాస్క్‌పోర్స్: తాడిపత్రిలో టీడీపీ నేతల ధన దాహానికి ఎర్ర వంక కనుమరుగవుతోంది. మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి అండ చూసుకుని తాడిపత్రిలో రూ.కోట్లు విలువ చేసే ఎర్ర వంకను పూడ్చి వెంచర్లు వేసి విక్రయాలు చేపట్టారు. ఫలితంగా చిన్నపాటి వర్షానికే తాడిపత్రిలోని శివానగర్, టైలర్స్ కాలనీలు జలమయమవుతున్నాయి.
పట్టించుకోని అధికారులు
తాడిపత్రికి శివారు ప్రాంతమైన ఆటో నగర్ నుంచి బైపాస్ రోడ్డు వెంబడి కడప రోడ్డు వరకూ దాదాపు 3 కిలోమీటర్ల మేర ఎర్రవంక విస్తరించి ఉంది. ఇటీవల పట్టణం విస్తరించడంతో బైపాస్ రోడ్డు పరిధిలోని భూములకు రెక్కలొచ్చాయి. ఎకరా భూమి రూ.కోట్లలో ధర పలుకుతోంది. దీంతో ఎర్ర వంకపై టీడీపీ నేతలు కన్నేశారు. వంక పోరంబోకు భూములను ఆక్రమించి వెంచర్లు వేసి విక్రయిస్తున్నారు. కొన్ని ప్లాట్లలో అక్రమ నిర్మాణాలూ కొనసాగుతున్నాయి. టీటీడీ కల్యాణమంటపం సమీపంలో టీడీపీ నేత ఒకరు ఏకంగా వంకను పూడ్చి చిన్న పాటి కాలువగా మార్చేశాడు. మిగులు భూమిలో వెంచర్ వేసి అమ్మకానికి పెట్టాడు. ఇంత జరుగుతున్నా.. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు అటుగా కన్నెత్తి కూడా చూడడం లేదు. అక్రమార్కులు టీడీపీ నేతలు కావడంతో అడ్డుకునేందుకు సాహసించలేకపోతున్నారు.
వంకను పూడ్చి రియల్ దందా మొదలు పెట్టిన టీడీపీ నేతలు
రూ.కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమి విక్రయాలను మౌనంగా చూస్తున్న అధికారులు
ఎర్రవంక మాయం


