వారసత్వ సంపదను కాపాడుకుందాం
● కలెక్టర్ ఆనంద్
అనంతపురం కల్చరల్: వారసత్వ సంపదను కాపాడుకోవడం అందరి బాధ్యత అని కలెక్టర్ ఆనంద్ అన్నారు. నగరంలో వారం రోజులుగా సాగుతున్న ప్రపంచ వారసత్వ వారోత్సవాలు మంగళవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా స్థానిక కల్లూరు సుబ్బారావు పురావస్తు ప్రదర్శన శాలలో నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు అందించిన సహకారం ఎంతో ప్రోత్సాహమిచ్చిందన్నారు. అనంతరం వివిధ పోటీల్లో ప్రతిభ కనబరచిన విద్యార్థులకు బహుమతులనందించారు. న్యాయనిర్ణేతలుగా వ్యవహరించిన కవులు, రచయితలను సత్కరించారు. కార్యక్రమంలో పురావస్తు శాఖ ఏడీ స్వామినాయక్, పర్యాటక శాఖ అధికారి జయకుమార్, డిస్కవర్ ఏజీ అనిల్‌కుమార్‌రెడ్డి, లేడీస్‌క్లబ్ సెక్రటరీ పద్మానారాయణరెడ్డి, ఇన్నర్‌వీల్ జయంతి, ఇంటాక్ కన్వీనర్ రాంకుమార్ తదితరులు పాల్గొన్నారు.


