పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలి
కళ్యాణదుర్గం రూరల్: రైతుల పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కళ్యాణదుర్గం వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం ఆర్డీఓ వసంతబాబును కలసి వినతి పత్రం అందజేసి, మాట్లాడారు. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరతో పంటలను కొనుగోలు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో మార్కెట్‌లో వ్యాపారులు, దళారులు సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధరతో పంటను కొనుగోలు చేస్తున్నారన్నారు. ఫలితంగా జిల్లాలో మొక్కజొన్న, అరటి రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు. ప్రభుత్వం స్పందించి రైతులను ఆదుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అలాగే యాటకల్లు, ఐదుకల్లు గ్రామాల మధ్య కొండల్లో అక్రమంగా సాగుతున్న మైనింగ్‌ను అరికట్టాలని కోరారు. అక్రమంగా మైనింగ్ చేస్తున్న టీడీపీ నేతలపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులు, జెడ్పీటీసీ బొమ్మన్న, రైతు విభాగం నేత నరేంద్రరెడ్డి, అభిలాష్‌రెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ ఎర్రంపల్లి కృష్ణమూర్తి, కన్వీనర్లు గోళ్ల సూరి, చంద్రశేఖర్‌రెడ్డి, ఎంఎస్ హనుమంతురాయుడు, రామాంజినేయులు, మురళి, అంజి, కృష్ణారెడ్డి, దొడగట్ట నారాయణ, పాతలింగ, మల్లి, చరణ్, రామచంద్ర, బసవరాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కళ్యాణదుర్గంలోని అంబేడ్కర్ సర్కిల్‌లో సోమవారం ఆయన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్రంలో వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్‌చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ పట్టణ కన్వీనర్ సుఽధీర్, కౌన్సిలర్ లక్షన్న, బిక్కిహరి, సురేష్, జాకరీర్, గంగాధర్, హబీబ్, లత, హలీం, అరుణ, తదితరులు పాల్గొన్నారు.
మాజీ ఎంపీ తలారి రంగయ్య డిమాండ్


