ప్రతిభకు పట్టం..
స్నాతకోత్సవంలో భాగంగా సత్యసాయి డీమ్డ్ యూనివర్సిటీ పరిధిలోని వివిధ విభాగాల్లో ప్రతిభ చాటిన 20 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందజేశారు. బంగారు పతకాలు పొందిన వారిలో గుండా నవ్యసాయి, సాయి శ్రీరాం, బెల్లపురవ్వల శ్రేయ, చెరుకూరి సాయి కార్తీక్, సానియా, అనిరుధ్ బండారి, ప్రియాన్షు చెత్రి, సాయి శరణ్య, సాయి సుమిత్ర దోర, గుడ్ల నటరాజ్, ముని లింబు, ప్రశాంత్, పంచాంగం నరసింహమూర్తి, హరిశ్రీ నారాయణ, ఆరాధ్య, సాయి గణేష్, ఆశిష్‌దీప్ చెత్రి, రాజ్‌కుమార్ ఠాకూర్, విక్రమ్ కృష్ణ, రితురాజ్ ప్రదాన్ తదితరులు ఉన్నారు. మరో 14 మందికి పరిశోధన రంగంలో డాక్టరేట్లు, 521 మందికి డిగ్రీ పట్టాలను ముఖ్య అతిథి, భారత ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ చేతుల మీదుగా అందజేశారు. జాతీయ గీతాలాపన అనంతరం చాన్సలర్ చక్రవర్తి స్నాతకోత్సవం ముగించారు. కార్యక్రమంలో మంత్రి నారా లోకేష్, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె.రత్నాకర్ రాజు, ట్రస్ట్ సభ్యులు నాగానంద, డాక్టర్ మోహన్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


