సెల్‌ఫోన్లు పనిచేయడం లేదు
ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకంపై అంగన్‌వాడీ టీచర్లకు శిక్షణ ఇవ్వలేదు. వారి వద్ద ఉన్న సెల్‌ఫోన్లు యాప్‌కు సపోర్టు చేయడం లేదు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కుస్తీ పడితే ఒక లబ్ధిదారురాలి వివరాలు ఎన్‌రోల్‌మెంట్ చేయడం కష్టంగా ఉంది. సూపర్‌వైజర్లు మాత్రం టీచర్లపై వత్తిడి తెస్తున్నారు. అంగన్‌వాడీ టీచర్లు ఇబ్బందులు పడుతున్నారు. యాప్‌పై వెంటనే టీచర్లకు శిక్షణ ఇవ్వాలి. సాంకేతిక సమస్యలు పరిష్కరించాలి.
– రమాదేవి, జిల్లా ప్రధాన కార్యదర్శి,అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్


