వైఎస్ జగన్ పర్యటన ఖరారు
● రేపు రాప్తాడుకు రాక
రాప్తాడు: వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన ఖరారైంది. ఈ నెల 23న ఆయన రాప్తాడుకు రానున్నారు. పర్యటన షెడ్యూల్‌ను మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి శుక్రవారం మీడియాకు వెల్లడించారు. రాప్తాడులో 44వ జాతీయ రహదారిపై హెచ్‌పీ పెట్రోలు బంక్ ఎదురుగా ఏర్పాటు చేస్తున్న కల్యాణ మండపంలో తన సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి నయనతారెడ్డి దంపతుల కుమార్తె మోక్షిత విష్ణుప్రియారెడ్డి, తేజేష్‌రెడ్డి వివాహానికి వైఎస్ జగన్ విచ్చేయనున్నట్లు చెప్పారు. ఇందుకోసం హెలిప్యాడ్ సిద్ధం చేసున్నారు. జగన్ పర్యటన నేపథ్యంలో భారీగా ప్రజలు తరలివచ్చే అవకాశం ఉండటంతో అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
పర్యటన ఇలా...
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదివారం ఉదయం 10 గంటలకు బెంగళూరులోని యలహంక నుంచి బయలుదేరుతారు. రోడ్డు మార్గంలో 10.20 గంటలకు జక్కూరు ఏరోడ్రోమ్‌కు చేరుకుంటారు. 10.30 గంటలకు జక్కూరు ఏరోడ్రోమ్ నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరుతారు. 11.30కు రాప్తాడులోని లింగనపల్లి రోడ్డులో బొమ్మేపర్తి గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమ ప్రవేశ ద్వారం సమీపంలో ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 11.40కు హెలిప్యాడ్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు. 11.55 గంటలకు కల్యాణ మండపానికి రోడ్డు మార్గాన చేరుకుంటారు. 11.55 నుంచి 12.15 గంటల వరకు పెళ్లి వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. 12.25కు హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. 12.30 గంటలకు రాప్తాడు హెలిప్యాడ్ నుంచి బయలుదేరుతారు. 1.30 గంటలకు జక్కూరు ఏరోడ్రోమ్ బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 1.40 గంటలకు బయల్దేరి యలహంకలోని నివాసానికి చేరుకుంటారు.


