జెడ్పీ ఉద్యోగులకు పదోన్నతి
అనంతపురం సిటీ: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జిల్లా పరిషత్ యాజమాన్యం కింద పని చేస్తున్న తొమ్మిది మంది సీనియర్ అసిస్టెంట్లకు పాలనాధికారులు(ఏఓ)గా పదోన్నతి కల్పిస్తూ పోస్టింగ్‌లను కల్పించారు. ఈ మేరకు ఉత్తర్వులను జెడ్పీలోని తన చాంబర్‌లో జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ శుక్రవారం అందజేశారు. అనంతపురంలోని జెడ్పీ కార్యాలయంలో పనిచేస్తున్న శ్రీనివాసులును జెడ్పీలోనే ఏఓగా నియమించారు. అలాగే ఏకాంబరయ్యను గోరంట్లకు, పి.సురేష్‌రెడ్డిని తాడిమర్రికి, పూర్ణ ఖలందర్‌ను వజ్రకరూరుకు, పీఆర్ క్యూసీ సబ్ డివిజన్‌లో పని చేస్తున్న రవిని బుక్కరాయసముద్రం, వజ్రకరూరులో పనిచేస్తున్న శ్రీధర్‌శర్మను కనగానపల్లికి, కదిరి పీఆర్‌ఐ సబ్ డివిజన్‌లో పని చేస్తున్న అశోక్‌కుమార్‌రెడ్డిని నల్లచెరువుకు బదిలీ చేశారు. సోమందేపల్లి నుంచి అబ్దుల్ రహిమాన్‌ను గుడిబండకు బదిలీ చేశారు. కార్యక్రమంలో సీఈఓ జీసీ శంకర్, డిప్యూటీ సీఈఓ జీసీ సుబ్బయ్య, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా ఖ్యాతిని చాటిచెప్పండి
● మాక్ అసెంబ్లీకి ఎంపికై న విద్యార్థులతో డీఈఓ ప్రసాద్‌బాబు
అనంతపురం సిటీ: రాష్ట్ర స్థాయిలో జిల్లా ఖ్యాతిని చాటి చెప్పేలని మాక్ అసెంబ్లీకి ఎంపికై న విద్యార్థులకు డీఈఓ ప్రసాద్‌బాబు సూచించారు. జిల్లా నుంచి ఎంపికై న 8 మంది విద్యార్థులు, హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులను శుక్రవారం తన చాంబర్‌లో ఆయన అభినందించి, మాట్లాడారు. కార్యక్రమంలో అసిస్టెంట్ డైరెక్టర్ మునీర్‌ఖాన్, డిప్యూటీ డీఈఓ మల్లారెడ్డి, ఏఎస్‌ఓ శ్రీనివాసులు, ఏపీడీఓ మంజునాథ్, నోడల్ ఆఫీసర్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
మార్చి నెలాఖరులోపు పనులన్నీ పూర్తి కావాలి
● పీఆర్ ఎస్‌ఈ చిన్న సుబ్బరాయుడు
అనంతపురం సిటీ: ఏపీ గ్రామీణ రహదారుల ప్రాజెక్ట్, ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన కింద చేపట్టిన రహదారులు, వంతెనల నిర్మాణాలను మార్చి నెలాఖరులోపు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను పంచాయతీరాజ్ ఇంజినీర్(ఎస్‌ఈ) వై.చిన్న సుబ్బరాయుడు ఆదేశించారు. అనంతపురంలోని సర్కిల్ కార్యాలయంలోని తన చాంబర్‌లో శుక్రవారం నిర్వహించిన ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్ట్ ఈఈలు శంకరయ్య, శ్రీరాములు, డీఈఈలు మురళీ, నారాయణస్వామి, నాగేంద్రకుమార్, సుధాకర్ నాయక్, తిరుమలరెడ్డి, ఏఈఈలు హుస్సేన్‌బాషా, లక్ష్మీదేవి, కాంట్రాక్టర్లు హాజరయ్యారు. చేపట్టిన పనుల పురోగతిపై ఎస్‌ఈ ఆరా తీశారు. నిర్దేశిత గడువులోపు పూర్తి చేయకపోతే నిధులు వెనక్కు వెళ్లే ప్రమాదముందని హెచ్చరించారు.
జెడ్పీ ఉద్యోగులకు పదోన్నతి


