మాజీ మంత్రి శైలజనాథ్‌కు మాతృ వియోగం
అనంతపురం : మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సాకే శైలజనాథ్ తల్లి సాకే గంగమ్మ అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం ఉదయం కన్నుమూశారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్‌సీపీ నాయకులు పలువురు అనంతపురంలోని నాయక్‌నగర్‌లో ఉన్న శైలజనాథ్ ఇంటికి చేరుకుని గంగమ్మ పార్థివ దేహానికి నివాళులర్పించారు.
రూ.9 లక్షల విలువైన
ఎరువుల సీజ్
ఉరవకొండ: పట్టణంలోని పలు ఎరువుల దుకాణాలను కళ్యాణదుర్గం ఏడీఏ యల్లప్ప, ఉరవకొండ, విడపనకల్లు మండలాల వ్యవసాయాధికారులు రామకృష్ణుడు, పెన్నయ్య.. శుక్రవారం ఆకస్మిక తనిఖీ చేశారు. సాయి ఆగ్రో ఏజెన్సీలో రూ.5,93,900, లక్ష్మీవెంకటేశ్వర ఏజెన్సీలో రూ.2,80,300, మహలక్ష్మీ ఫర్టిలైజర్స్‌లో రూ. 1,12,810 విలువైన అనుమతుల్లేని ఎరువుల విక్రయాలను నిలుపుదల చేస్తూ నోటీసులు జారీ చేశారు. అలాగే ఈ మూడు షాపుల్లోనూ మొత్తం రూ.9,87,900 విలువ చేసే ఎరువులను సీజ్ చేశారు.
విడపనకల్లు: మండల కేంద్రంలోని వెంకటేశ్వర ఫర్టిలైజర్ షాపులో శుక్రవారం కళ్యాణదుర్గం ఏడీఏ యల్లప్ప, స్థానిక వ్యవసాయాధికారి పెన్నయ్య తనిఖీలు చేపట్టారు. రికార్డులకు నిల్వలకు వ్యత్యాసాలను గుర్తించి 32.9 టన్నుల ఆర్గానిక్ పటాస్ ఎరువులను సీజ్ చేశారు.
మాజీ మంత్రి శైలజనాథ్‌కు మాతృ వియోగం


