యాజమాన్యం పాటించాలి
ప్రధానంగా ఈ సీజన్‌లో వరిలో సుడిదోమ, కాండం తొలుచు, దోమపోటు, అగ్గితెగులు, పోడతెగులు, మానుతెగులు ఆశిస్తాయి. వీటి నివారణకు రైతులు సరైన యాజమాన్య పద్దతులు పాటించాలి. పురుగు నివారణకు ఎకరాకు ఆరు కిలోల కార్టఫ్ హైడ్రోక్లోరైడ్ గుళికలు వెదజల్లాలి. అలా కానిపక్షంలో ఎకరాకు 200 మి.గ్రా. గ్లామర్ పౌడర్ వినియోగించాలి. పొలాల్లో మురుగునీరు ఉండరాదు. తెగుళ్ల నివారణకు ఎకరాకు 200 మి.లీ.ప్రాఫిఫోనాజల్ లేదా ఆజాస్రీ్ట్రసోభిన్ పైరు పూర్తిగా తడిచేలా పిచికారీ చేయాలి.
– డాక్టర్ ఈ.చండ్రాయుడు,
ప్రధాన శాస్త్రవేత్త, కేవీకే, కళ్యాణదుర్గం


