శతాధిక వృద్ధురాలి మృతి
రాయదుర్గం టౌన్: స్థానిక మాజీ ఎమ్మెల్యే, స్వాతంత్య్ర సమరయోధుడు ఎన్‌సీ శేషాద్రి సతీమణి లీలావతమ్మ(103) గురువారం కన్నుమూశారు. రాయదుర్గం మండలంలోని రాయంపల్లి గ్రామానికి చెందిన లీలావతమ్మ రెండు నెలల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని పెద్ద కోడలి వద్ద ఉంటూ చికిత్స పొందుతోంది. పరిస్థితి విషమించడంతో గురువారం ఆమె మృతి చెందారు. కాగా, ఎన్‌సీ శేషాద్రి 1955లో కాంగ్రెస్ అభ్యర్థిగా గెలుపొంది శాసనసభ్యుడిగా ప్రజలకు సేవలందించారు. 30 ఏళ్ల క్రితం ఆయన మృతి చెందగా స్వగ్రామంలోనే భార్య లీలావతమ్మ నివాసముంటూ వచ్చారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, ముగ్గురు కుమారులు ఉన్నారు. అంత్యక్రియలను హైదరాబాద్‌లోనే చేయనున్నట్లు బంధువులు పేర్కొన్నారు.
కారు బోల్తా..
ముగ్గురికి గాయాలు
ఆత్మకూరు: స్థానిక పంపనూరు వద్ద ఉన్న సిటీ పార్క్‌లో గురువారం ఫొటో సూట్ కోసం వచ్చిన అనంతపురానికి చెందిన ఓ కుటుంబం తిరుగు ప్రయాణంలో వడ్డుపల్లి కొండ వద్ద టైర్ పంక్చర్ కావడంతో కారు బోల్తాపడింది. అందులోని ముగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ ద్వారా జీజీహెచ్‌కు తరలించారు.
శతాధిక వృద్ధురాలి మృతి


