రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీలకుఎంపిక
గుంతకల్లు: మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామ హైవే నుంచి దొనిముక్కల బ్రిడ్జి మధ్య జిల్లాస్థాయి సైక్లింగ్ పోటీలను మంగళవారం నిర్వహించారు. ఇందులో భాగంగానే పోటీల్లో ప్రతిభ చూపిన వారిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. అండర్–14 బాయ్స్ విభాగంలో బి.మనోజ్ (కొనకొండ్ల). ఎం.శివశంకర్ (గడేకల్), దినేష్‌సాయి (వజ్రకరూరు), అర్.లిఖిత్‌నాయక్ (వజ్రకరూరు) ఎంపికయ్యారు. అలాగే అండర్–14 గ్లర్స్ విభాగంలో ఖాజాబీ (గుంతకల్లు). షబీనా (వజ్రకరూరు), నిత్యశ్రీ (గడేకల్), జయశ్రీ (కొనకొండ్ల) ఎంపికయ్యారు. అండర్–17 గ్లర్స్ విభాగంలో సంజన (కొనకొండ్ల). ప్రణితి (గడేకల్), అపూర్వ (గుంతకల్లు), షణ్ముఖ (గడేకల్) ఎంపికై నట్లు అసోసియేషన్ నాయకులు తెలిపారు. ఈ నెల 21వ తేదీ విజయవాడ సమీపంలోని మున్నా అనే గ్రామంలో జరిగే రాష్ట్రస్థాయి సైక్లింగ్ పోటీల్లో వారు పాల్గొననున్నట్లు పేర్కొన్నారు. అంతకు ముందు నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనంతపురం జిల్లా సైక్లింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు సోమశేఖర్, జాయింట్ సెక్రటరీ నారాయణ, ఎంఈఓలు సుబ్బరాయుడు, మల్లికార్జున, హెచ్‌ఎంలు నారాయణరెడ్డి, పుండరీకాక్ష తదితరులు పాల్గొన్నారు.


