దూడకు ఆర్థోపెడిక్ సర్జరీ
అనంతపురం అగ్రికల్చర్: ప్రమాదవశాత్తూ ఏడాది వయస్సున్న పెయ్యదూడ దవడ విరిగిపోవడంతో పశుశాఖ ఏడీ డాక్టర్ జి.పద్మనాభం బృందం సర్జరీ చేసి బాగు చేసింది. రాయదుర్గానికి చెందిన ఎలుగు సతీష్‌కుమార్ అనే రైతుకు చెందిన పెయ్యదూడకు ప్రమాదంలో దవడ విరిగి చిట్లి పోయింది. మేత, నీళ్లు లేక బలహీనంగా తయారైంది. సంబంధిత పశువైద్యుడి దృష్టికి తీసుకెళ్లడం, సీరియస్ కేసు కావడంతో శింగనమల ఏడీ డాక్టర్ జి.పద్మనాభానికి సిఫారసు చేశారు. రాయదుర్గం నుంచి దూడను అనంతపురం పశువుల ఆస్పత్రికి తరలించి పరీక్షించారు. ఆర్థోపెడిక్ ఆపరేషన్ చేసేందుకు రైతు అంగీకారంతో నాలుక కింద ప్యాలెట్ ముకోసా చీరుకుపోయిన, చిట్లిపోయిన దూడ దవడ ఎముకకు 4.5 మి.మీ స్టెయిన్‌లెస్ స్టీల్ స్కాంజ్ పిన్‌ను అమర్చారు. ముక్కలైన దూడ దవడ ఎముకలను యథాస్థానంలో ఉండేలా శస్త్రచికిత్స చేశారు. ప్రస్తుతం దూడ చాలా ఆరోగ్యంగా ఉన్నట్లు తెలిపారు. శస్త్రచికిత్సలో అంబులెన్స్ డాక్టర్లు సునీత, సుచరిత, పారావెట్ ఆకాష్, ట్రైనీ డాక్టర్లు పాల్గొన్నారు.
దూడకు ఆర్థోపెడిక్ సర్జరీ


