నైపుణ్య శిక్షణతోనే ఉపాధి అవకాశాలు
అనంతపురం టౌన్/రాప్తాడు: నైపుణ్య శిక్షణతోనే ఉపాధి అవకాశాలు లభిస్తాయని కలెక్టర్ ఆనంద్ అన్నారు. మంగళవారం స్థానిక పంగల్ రోడ్డులోని టీటీడీసీలో స్కిల్ కళాశాలను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నైపుణ్య శిక్షణ కేంద్రంలో కొత్త కోర్సులను ప్రవేశపెట్టి నిరుద్యోగ యువతకు శిక్షణ అందించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులను ఆదేశించారు. నిరుద్యోగ యువత శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు పొంది తల్లిదండ్రులకు బాసటగా నిలవాలన్నారు. నైపుణ్య శిక్షణపై గ్రామాల్లోని నిరుద్యోగ యువతకు సూచనలివ్వాలన్నారు. అనంతరం టీటీడీసీ ఆవరణంలో కలెక్టర్ మొక్కలు నాటారు. కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ శైలజా, జిల్లా మేనేజర్ సూర్యనారాయణ, డీపీఎం ఫైనాన్స్ సత్యనారాయణ, ఏపీఎం శ్రీనివాసులు, ప్రతాప్‌రెడ్డి పాల్గొన్నారు.
రైతుల సమస్యలు పరిష్కరించాలి
పెద్దవడుగూరు: రైతుల సమస్యల పరిష్కారానికి అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఓ.ఆనంద్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని పి.వీరన్నపల్లి సమీపంలో రూ. 16.75 కోట్లతో నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. స్థానిక రైతులతో మాట్లాడారు. బ్రిడ్జి నిర్మాణం ఎత్తుగా ఉండటంతో దారి సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని పలువురు రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లగా.. సమస్య పరిష్కారానికి త్వరితగతిన చర్యలు చేపట్టాలని తహసీల్దార్ ఉషారాణిని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పీజీఆర్‌ఎస్ అర్జీలపై క్షేత్రస్థాయిలో విచారించారు. పత్తి పంట పొలాన్ని పరిశీలించి రైతు సుంకన్నతో మాట్లాడారు. గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆయనతో వాపోయారు. కార్యక్రమంలో ఎస్‌ఈ సుబ్బరాయుడు, ఈఈ శ్రీరాములు, డీఈ డీఎల్ మురళీ, జేఈ పాండురంగారెడ్డి, ఎంపీడీఓ బారన్‌సాహెబ్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ ఆనంద్


