నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం కార్యవర్గం ఎన్నిక
అనంతపురం అర్బన్: ఏపీ ప్రభుత్వ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా నూతన కార్యవర్గాన్ని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం అనంతపురంలోని ఆ సంఘం కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.మల్లేశ్వరావు, ఇ.మద్దిలేటి పర్యవేక్షణలో కార్యవర్గంలోని 9 స్థానాలకు ఎన్నికల నిర్వహించారు. ఎన్నికల అధికారిగా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్.సుబ్రహ్మణ్యం, సహాయ అధికారిగా రాష్ట్ర కార్యదర్శి కె.రమణ వ్యవహరించారు. తొమ్మిది స్థానాలకు తొమ్మిది నామినేషన్లు మాత్రమే దాఖలు కావడంతో కార్యవర్గం ఏకగ్రీవమైంది. జిల్లా అధ్యక్షుడిగా తోట చెన్నప్ప, సహ అధ్యక్షుడిగా పి.వెంకటరామిరెడ్డి, ఉపాధ్యక్షులుగా కె.శ్రీహరి, బి.నాగరాజు, కార్యదర్శిగా ఎం.పెద్దరెడ్డప్ప, సంయుక్త కార్యదర్శులుగా డి.రాధమ్మ, డి.వెంకటేశ్వర్లు, ప్రచార కార్యదర్శిగా బి.ఫక్కీరప్ప, కోశాధికారిగా ఎస్.జాఫర్‌వలి ఎన్నికయ్యారు.
గుంతకల్లు పశువుల ఆస్పత్రిలో అగ్నిప్రమాదం
గుంతకల్లు రూరల్: స్థానిక మార్కెట్ యార్డులోని పశువుల ఆస్పత్రిలో శనివారం రాత్రి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం పశువుల ఆస్పత్రి నుంచి పొగలు వస్తుండడం మార్కెట్ యార్డులో గొర్రెల సంతకు వచ్చిన రైతుల ద్వారా సమాచారం అందుకున్న ఆస్పత్రి సిబ్బంది అక్కడకు చేరుకుంది. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది అక్కడు చేరుకుని కొద్ది పాటి మంటలను ఆర్పివేశారు. కాగా, అప్పటికే దాదాపు రూ.10 లక్షల విలువైన మందులు, ఫ్రిడ్జ్ ఇతర సామగ్రి కాలిబూడిదయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగినట్లుగా నిర్ధారణ అయింది.
23న కళ్యాణదుర్గంలో
జిల్లా స్థాయి చెకుముకి సంబరాలు
అనంతపురం కల్చరల్: జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 23న జిల్లా స్థాయి చెకుముకి సంబరాలను కళ్యాణదుర్గంలో నిర్వహించనున్నారు. ఆదివారం స్థానిక సంఘమేష్ నగర్‌లోని జేవీవీ కార్యాలయంలో చిత్తప్ప జేవీవీ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరరాజు వెల్లడించారు. కార్యక్రమంలో జేవీవీ జిల్లా నాయకులు రామిరెడ్డి, గాంగేనాయక్, ప్రసాద్, లక్ష్మీనారాయణ, నరసింహుడు తదితరులు పాల్గొన్నారు.


