ముగిసిన ‘సహకార’ అసోసియేషన్ ఎన్నికలు
అనంతపురం అగ్రికల్చర్: మూడేళ్ల కాలపరిమితి కలిగిన సహకార శాఖ ఉద్యోగుల అసోసియేషన్ జిల్లా కమిటీ ఎన్నికలు ఆదివారం ముగిశాయి. సహకారశాఖ సీనియర్ ఇన్‌స్పెక్టర్ కె.లీలావతి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఆ తర్వాత ఓట్ల లెక్కింపు, ఫలితాలు ప్రకటించి గెలుపొందిన అభ్యర్థులకు డిక్లరేషన్ అందజేశారు. కమిటీలో 9 పోస్టులకు గానూ ఎన్నికలకు ముందే జాయింట్ సెక్రటరీగా ఆర్.రమణమాధవి, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ సెక్రటరీగా పి.నరసింహమూర్తి, ఎం.లతీఫ్ ఏకగ్రీవం అయ్యారు. కేవలం 56 ఓట్లు ఉన్న మిగిలిన ఆరు పదవులకు ఎన్నికలను నిర్వహించారు. రెండు ప్యానళ్లు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పోలీసు బందోబస్తు మధ్య గుర్తులు లేకుండా అభ్యర్థుల పేర్ల మీద పోలింగ్ నిర్వహించారు. డీసీఓ, డీసీఏఓ కార్యాలయాలతో పాటు డీఎల్‌సీఓ కార్యాలయాల్లో జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ నుంచి పనిచేస్తున్న ఉద్యోగులు 52 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. అధ్యక్షుడిగా బి.మల్లరాయుడు, కార్యదర్శిగా ఎస్.కుమార్, అసోసియేట్ ప్రెసిడెంట్‌గా ఎం.సృజన్, ఉపాధ్యక్షుడిగా వై ఎండీ ఇస్మాయిల్, జాయింట్ సెక్రటరీగా టి.రమేష్‌బాబు ట్రెజరర్ పోస్టు కోసం పోటీ పడిన ఎం.వెంకటేశ్వర్లు, జి.సతీష్‌కుమార్‌కు చెరి 26 ఓట్లు సమానంగా రావడంతో... ఇరువురు అభ్యర్థుల అంగీకారంతో మొదటి ఏడాదిన్నర ఎం.వెంకటేశ్వర్లు, రెండో టర్మ్ కింద ఏడాదిన్నర పాటు జి.సతీష్‌కుమార్‌కు అవకాశం కల్పించారు.
అధ్యక్షుడిగా మలరాయుడు,
సెక్రటరీగా కుమార్ గెలుపు


