వాటర్ క్యాన్ రూపాయికే..
2011లో విదేశీయుల సహకారంతో చెర్లోపల్లి పంచాయతీ కార్యాలయంలో రూ.10 లక్షల వ్యయంతో వాటర్ ఫిల్టర్‌ను ఏర్పాటు చేశారు. క్యాన్ వాటర్ రూపాయికే ఇన్నాళ్లూ అందించారు. నిర్వహణ ఖర్చు పెరగడంతో ఇటీవల ఒక్కో కుటుంబం నుంచి నెలకు రూ.90 వసూలు చేస్తున్నారు. గ్రామ పెద్దల సహకారంతో పాటు విదేశీయుల ఆర్థిక చేయూత తోడు కావడంతో తాగునీరు నిర్విరామంగా తాగుతున్నట్లు గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఇక గ్రామానికి సమీపంలో నిర్మించిన ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి విదేశీయులు రూ.3 లక్షల వరకూ విరాళం ఇచ్చారు.


