సైన్స్ ప్రాజెక్టుల ప్రదర్శనలో మెరిసిన చీమలవాగుపల్లి వి
అనంతపురం సిటీ: స్కూల్ ఇన్నోవేషన్ మారథాన్–2025 జాతీయస్థాయిలో నిర్వహించిన సైన్స్ ప్రాజె క్టుల ప్రదర్శనలో పెద్దపప్పూరు మండలం చీమలవాగుపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థినులు ప్రవల్లిక, కళ్యాణి, షబానా మెరిశారు. వీరు రూపొందించిన ‘సోలార్ టేస్డ్ మెడిసిన్ స్ప్రేయర్ ప్రాజెక్ట్–సౌరశక్తి ఆధారిత పిచికారీ యంత్రం’ జాతీయ స్థాయిలో జిల్లాకు కీర్తి తెచ్చిపెట్టిందని జిల్లా సైన్స్ సెంటర్ అధికారి బాలమురళీకృష్ణ శనివారం తెలిపారు. జాతీయస్థాయిలో మొత్తం 72 వేల ప్రాజెక్టులు ప్రదర్శనకు రాగా.. అందులో 1000 ప్రాజెక్టులను ఎంపిక చేశారన్నారు. రెండో రౌండ్‌లో 100 ప్రాజెక్టులు మాత్రమే పోటీకి ఎంపికై నట్లు వివరించారు. అందులో చీమలవాగుపల్లి విద్యార్థినులు రూపొందించిన ప్రాజెక్ట్ ఉండడం గర్వంగా ఉందని చెప్పారు. ఏఐఎం అటల్ ఇన్నోవేషన్ మిషన్ వారు ఫైనల్‌గా ఎంపిక చేసే 30 ప్రాజెక్టుల్లో మన జిల్లా అమ్మాయిలు రూపొందించిన ప్రాజెక్ట్ ఎంపికై తే ప్రముఖ టెక్నాలజీ దిగ్గజం డెల్ కంపెనీ వారు ఇంటర్న్‌షిప్ కల్పిస్తారని వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ రూపకల్పనలో అవసరమైన శాసీ్త్రయ సహకారాన్ని అందించడంతో పాటు విద్యార్థినులకు అనంతపురం డిగ్రీ కళాశాల అధ్యాపకుడు జీఎల్‌ఎన్ ప్రసాద్ గైడ్‌గా కూడా వ్యవహరించారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రసాద్‌ను డీఈఓ ప్రసాద్‌బాబు, సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజాచౌదరి అభినందించారు.


